గురుదేవో నమః..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గురుదేవో నమః..!
– గురువును పూజించిన కౌన్సిలర్ సాహు శ్రీలత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తమకు విద్యా, బుద్దులు నేర్పిన గురువును తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ పూజించారు. ఆదివారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువును పూజించి.. సన్మానించారు. పెద్దేముల్ మండలం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో సాహు శ్రీలత చదువుకునే సమయంలో అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యావతి హిందీ బోధన చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సాహు శ్రీలత గురువు విద్యావతిని కలిసి పూజ చేశారు.

శాలువాతో సత్కరించి వందనం సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా యోగా గురువు, వారి పిల్లల గురువు అయిన రాధిను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య నేర్పిన గురువులు భగవంతునితో సమానమన్నారు. గురు పౌర్ణమి రోజున గురువును సన్మానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారి పిల్లలు సాము శ్రీస్వాన్వి, సాహు శ్రీసాహితి, గాయత్రి, శివాని, ఆశ్రీత, విద్యార్థులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సాయిబాబను దర్శించుకున్న సరళా రెడ్డి