ఎమ్మెల్యే సహాకారంతో వార్డులు అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే సహాకారంతో వార్డులు అభివృద్ధి
– టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో మున్సిపల్లోని వార్డుల అభివృద్ధి జరుగుతోందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 30వ వార్డులో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మహరాజ్ భేగం ఆధ్వర్యంలో చేపడుతున్న ఇనుప స్థంబాల స్థానంలో సిమెంట్ స్కంబాల ఏర్పాటు పనులను అప్పూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్ మహరాజ్ భేగం ఆధ్వర్యంలో వార్డులో పారిశుద్ధ్యం, ప్రభుత్వ కార్యాక్రమాలు పక్కాగా కొనసాగుతున్నాయన్నారు. వచ్చే వర్షాకాలంలో ఇనుప స్థంబాల నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో వార్డులో సిమెంట్ సంభాలను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడ ఎమ్మెల్యే సహాకారంతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే సహాకారంతో తాండూరు పట్టణం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి అధ్యక్షులు యూసుఫ్ ఖాన్, వార్డు సభ్యులు సాజిద్, విద్యుత్ లైన్ మెన్ గొ పాల్, కాంట్రాక్టర్ సాయి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్త‌ను స‌మ‌ర్పించిన వారు