మొక్కలతోనే మనుగడ…!

తాండూరు రాజకీయం వికారాబాద్

మొక్కలతోనే మనుగడ…!
– అందరు మొక్కలు నాటాలి
– కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యపడుతుందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శిక్ష సప్త అనే కార్యక్రమంలో భాగంగా హరితహరంను పురస్కరించుకుని మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. కౌన్సిలర్ సంగీత ఠాకూర్ టీచర్స్ మాధవి, సరిత, జగదీశ్వరి, విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు.

మొక్కకు రక్షణగా ట్రీ గార్డ్ ఏర్పాటు చేశారు. అనంతరం కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అన్నారు. మొక్కల నాటడం వల్ల వాటి నుంచి ప్రాణవాయువు పొందుతామని అన్నారు. అదేవిధంగా వాతావరణం కాలుష్యం తగ్గుతుందన్నారు. తద్వారా మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. మొక్కల నాటటంతో మానవాళీగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఘనంగా బొడ్రాయికి పూజలు