శభాష్ సపాయి కార్మికులు..!
– ఆర్టీకేలో మాన్ హోల్ క్లీనింగ్
– పనిచేయించిన మున్సిపల్ జవాన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్య పనుల్లో తాండూరు మున్సిపల్ కార్మికులు శభాష్ అనిపించుకున్నారు. తాండూరు మున్సిపల్ పరిధి 8వ వార్డు రాజీవ్ కాలనీలో గత కొన్ని నెలలుగా మ్యాన్ హోల్ పరిశుభ్రతకు నోచుకోలేదు. ఎవ్వరు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మంగళవారం రాజీవ్ కాలనీ జవాన్ సీహెచ్ అశోక్ ఆధ్వర్యంలో కార్మికులు హన్మంతు, డీ. రాములు మాన్ హోల్ ను శుభ్రం చేశారు. గంటల తరబడి పనిచేసి పేరుకుపోయిన చెత్త, చెదారం, మట్టిని తొలగించారు. లోపలికి దిగి మొత్తం శుభ్రం చేశారు. కష్టపడి శుభ్రం చేయడంతో స్థానికులు శభాష్ అంటూ అభినందించారు.
ఇదికూడా చదవండి..

