రేపు మాంసం దుకాణాలు బంద్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు మాంసం దుకాణాలు బంద్..!
– తాండూరు వ్యాపారులకు నోటీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో మాంసం దుకాణాలు బంద్ పాటించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. శుక్రవారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని చికెన్, మటన్, ఫిష్ మాంసం దుకాణాల వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. రేపు శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించడం జరిగిందని తెలిపారు. దుకాణాలే కాకుండా హోటల్స్, రెస్టారంట్లలో ఎక్కడా మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు వ్యాపారులందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి….

సార్లూ స్పందించారు..!