మందు బాబులపై కొరడా..!
– 14 మందికి జైలు, 13మందికి జరిమాన
– తాండూరు న్యాయస్థానం తీర్పు
– వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులపై కొరడా పడింది. జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ తాండూరు న్యాయస్థానం తీర్పు వెలువరించిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో పలువురు మందుబాబులు పట్టుబడ్డారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరు పరచగా సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ కేసుల వివరాలను పరిశీలించారు.
ఇందులో కె. రమేష్, అంతారం, ఎస్. కిషన్ – రాంనగర్, జహీరాబాద్, హెచ్. సాగర – నీళ్లపల్లి, వీ.బాబు- కోట బాస్పల్లి, ఎండీ.నవాజ్- సేడం, కె. నరేష్ – గోనూర్, ఎస్. వెంకటేష్ – కోట్‌పల్లి, అంబాదాస్ – గుమస్తా నగర్, తాండూరు, ఆశప్ప – తాండూర్, ఎన్. మున్నయ్య – తాండూరు, సాయప్ప- చంద్రవంచ, కె. శాంతు కుమార్ – తాండూరు, ఎం. రవి – తాండూరు, కాశప్ప – తాండూరు మొత్తం 14 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమాన విధించారు.
అదేవిధంగా మరో 13 మందికి రూ. 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు జరిమానా విధించినట్లు సీఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు.
ఇదికూడా చదవండి…

