శుభకార్యాలలో బీఎస్ఆర్
– మహిపాల్ రెడ్డికి బర్త్ డే విషెష్
– డొలారోహణంలో చిన్నారికి ఆశీర్వాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) శుభకార్యాలలో సందడి చేశారు. ఆదివారం తాండూరు నియోజక వర్గంలోని పెద్దెముల్ మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహిపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో మహిపాల్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి శాలువా పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తాండూరు పట్టణానికి చెందిన సంతోష్ రెడ్డి దంపతుల కుమారుడి బారసాల, నామకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువ నాయకులు పాల్గోన్నారు.
ఇదికూడా చదవండి…

