అట్టహాసంగా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నిక
– సంగెం రవీందర్ గౌడ్‌కు శుభకాంక్షల వెల్లువ
– ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారి ప్రకటన
– శుభాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సన్మానించిన ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నిక అట్టహాసంగా జరిగింది. సోమవారం తాండూరు మండలం ఎల్మకన్నె సహాకార సంఘం చైర్మన్, జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహఖ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్యల సమక్షంలో రవీందర్ గౌడ్ ను వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శర్మ రవీందర్ గౌడ్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రవీందర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు డీసీబీసీ, సహాకార సంఘాల సహాకారంతో సేవలందించాలని అన్నారు. అనంతరం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయమని, రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, యాలాల మాజీఎంపీపీ కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, పీఏసీఎస్ చైర్మన్లు ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్లు అజయ్ ప్రసాద్, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, తాండూరు మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు జీ.రాందాస్, పిన్నేముల మహిపాల్ రెడ్డి, కొమ్ము గోపాల్ రెడ్డి, డీవై నర్సింలు, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, మాజీ ఎంపీటీసీలు ఎం. రాజ్ కుమార్. మైనార్టీ నాయకులు అబ్దుల్ రవూఫ్, మసూద్, మున్సిపల్ కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు విజయ్ భాస్కర్ రెడ్డి, అజ్మత్ అలీ, ఎల్మకన్నె పీఏసీఎస్ మాజీ సీఈఓ చంద్రారెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, డైరెక్టర్లు నెమలిగ సురేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పెండా నర్సింలు, బుచ్చన్న, సర్పంచులు సంఘం మాజీ అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, మాజీ సర్పంచులు సాయిలు, ఎస్. పండరి, వడ్ల మల్లేశం, యువనాయకులు హరీశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు రవీందర్ గౌడ్ కు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
రవీందర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

ఇదికూడా చదవండి…

