తాండూరులో డిఫరెంట్ గణేష్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో డిఫరెంట్ గణేష్‌..!
– శివతాండవ రూపుడుగా కొలువు
– చూపరులను ఆకట్టుకున్న వినాయకుడు
– ఔరా అనిపిస్తున్న తాండూరోడి టాలెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సాధారణంగా వినాయక విగ్రహాలను సుద్దా, లేదా మట్టితో తయారు చేస్తారు. వినాయక చవితి వచ్చిందంటే ప్లాస్టర్ పారిష్‌తో తయారు చేసిన విక్రయాలను ప్రతిష్టిస్తుంటారు. ఈ సారి తాండూరులో వినాయక చవితి సందర్బంగా డిఫరెంట్ గణేషున్ని ప్రతిష్టించారు. పట్టణంలోని కాళీకాదేవి ఆలయ ప్రాంగణంలో శివతాండవ రూపంలో వినాయకుడు కొలువుదీరాడు. మూడు రోజులుగా పూజలందుకున్న గణనాథుడు భక్తుల చూపరులను ఆకట్టుకుంటున్నాడు. తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ ఈ వినాయకున్ని తయారు చేశాడు.

గత ఐదారేళ్ళుగా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేస్తున్నాడు. పెన్సిల్ మొనలపై సూక్ష్మ చిత్రాలను చెక్కడం, శరీరంపై టాటూలు వేసే మధుసూదన్ పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్నాడు. గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు, టిష్యూ పేపర్ వినాయకుడు, తట్టలు బుట్టల వినాయకుడు, వరి గడ్డి వినాయకుడు, రైతు కాన్సెప్ట్ తో గోధుమ గింజల వినాయకుడు …ఇలా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేశాడు. అదే తపనతో ఈసారి కూడా గోనెసంచులతో శివతాండవం చేస్తున్న వినాయక విగ్రహాన్ని తయారుచేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ గణేషున్ని దర్శించుకున్న భక్తులంతాల తాండూరోడి టాలెంట్‌ను అందరు ఔరా అంటూ అభినందిస్తున్నారు.

ఇదికూడా చదవండి….

వాటర్‌ ట్యాంకుపై వినాయకుడు