వెంకటేష్, రానాల క్రేజీ కాంబీనేషన్
హీరో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటితో కలిసి నటించబోతున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని చాలా రోజుల నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక తీరబోతుంది. వెంకటేశ్, రానా దగ్గుబాటి ఓ హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారు. దీన్ని ఇతర భాషల్లోని అనువాదం చేసి విడుదల చేస్తారని, ప్రముఖ డిజిటల్ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తుందని సమాచారం చక్కర్లు కొడుతోంది.

ఇది వరకు రానా హీరోగా చేసిన కృష్ణం వందే జగద్గురమ్ సినిమాలో ఓ పాటలో వెంకటేశ్ తళుక్కున మెరిశారు. అయితే వీరిద్దరూ పూర్తిస్థాయి పాత్రల్లో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక. లేటెస్ట్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఇటు వెంకటేశ్, అటు రానా ఇద్దరూ వారి సినిమాల కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్‌ను చిత్రీకరిస్తారట.

