అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరం
– సాయిపూర్లో పూల పండగ పూనకాలు
– ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– సందడి చేసిన పైలెట్ సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

ఆదివారం తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపా, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో 9వ వార్డులో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దీపా నర్సింలుతో పాటు మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ, కుటుంబ సభ్యులు సద్దుల బతుకమ్మను అందంగా అలంకరించి మోసుకవచ్చారు.

తాత గుడి వద్ద తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా సంబరాలను ప్రారంభించారు. వార్డుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సతీమణి ఆర్తిరెడ్డి, తల్లి వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. సంబరాలలో భాగంగా బతుకమ్మ పాటలకు లయబద్దంగా ఆడుతూ ఉత్సహా పరిచారు.

బతుకమ్మ ఆట పాటలతో సాయిపూర్ ప్రాంతం పూల పండగ పూనకాల్లో ఊగిపోయింది. అనంతరం సద్దుల బతుకమ్మను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఈ వేడుక కూడా శోభాయామానంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డా.సంపత్ కుమార్, రాజప్ప గౌడ్, సిద్రాల శ్రీనివాస్, శకుంతల, కౌన్సిలర్లు నవీన గౌడ్, రూప రుద్రుపాటిల్, నాగలక్ష్మీ, మహేశ్వరి, సుప్రీత, ప్రశాంతి, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


