పట్నం కోసం కదిలొచ్చిన ప్రాణదాతలు..!
– జిల్లా ఆసుపత్రిలో రక్తదానం చేసిన యవకులు
– అభినందించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి :మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కోసం తాండూరుకు చెందిన యువకులు రక్తం పంచి అభిమానం చాటుకున్నారు. సోమవారం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువనాయకులు బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు తరలివచ్చి రక్తదానం చేశారు.

మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆసుపత్రి వైద్య బృందం సమక్షంలో దాదాపు 25 మంది యువకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. యువకులు చేసిన రక్తదానంను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభినందించారు. యువకులు చేసిన సేవతో ఆపదలో ఉన్న బాధితుల ప్రాణాలు నిలుపుకోవచ్చన్నారు. అదేవిధంగా బిడ్కర్ రఘు మాట్లాడుతూ మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానంకు యువకులను ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు జిల్లా ఆసుపత్రిలో రోగులకు అల్పహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయరవి, మహిళ నాయకురాలు నాగమ్మ, యువకులు మంతన్‌గౌడ్ అశోక్, పునీత్, సిద్దు పంతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

