విద్యార్థులకు మరో అవకాశం…!
– నవోదయ దరఖాస్తుల గడువు పొడగింపు
– ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..?
దర్శిని డెస్క్ : దేశంలోని జవహర్ నగర్ నవోదయ స్కూళ్లలో చేరాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం దక్కింది. ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ దరఖాస్తుల కోసం గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 23వ తేదీతో ఆరో తరగతి ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఈ గడువును అక్టోబర్ 7, 2024వ తేదీ మరకు పొడిగిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ప్రకటన విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు కోరిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోనే 24 వరకు నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. యేటా వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆరో తగరతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తెలుగుతో సహా మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు తాజాగా దరఖాస్తు తేదీ పెరిగడంతో మరో అవకాశం ఇచ్చినట్లైంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. అలాగే బాలురకు, బాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థుల మే 01, 2013 నుంచి జులై 31, 2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
ఇదికూడా చదవండి…

