బైపాస్.. పరిహారం మంజూరు చేయండి
– ఆర్అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరికి ఎమ్మెల్యే వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం మంజూరు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు.

శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ వికాస్ రాజ్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ శివారులో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణంలో కొందరు రైతులు భూములు కోల్పోతున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేయాలని, ఇందుకు జీవో విడుదల చేయాలని కోరారు.

ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే బాధితులకు పరిహారం అందించేలా చూస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ ఉన్నారు.

ఇదికూడా చదవండి…

