తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు..!
– గౌడ కులస్తుల సంక్షేమానికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కల్లు సోసైటీ ద్వారా ప్రోత్సహాక సాయం పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కొత్తగా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్ లో కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు వె ఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు ప్రోత్సహాక సాయం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు సాయం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సహాకారంతో తాండూరులో ఇంటిగ్రేటేట్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గౌడ్ల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. విద్య, వైద్యం, వివిధ రంగాలలో అభివృద్ధి చెందేలా చూస్తామన్నారు. గౌడస్తులు కోరిన విధంగా ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రాము, కల్లు గీత సొసైటీ నాయకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

