మార్కెట్ కమిటి నిర్మాణ పనులు వేగవంతం చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ కమిటి నిర్మాణ పనులు వేగవంతం చేయండి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ కమిటీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తో మాట్లాడి నిర్మాణ ప నుల గురించి ఆరా తీశారు. పనులు ఎప్పటి వరకు పూర్తి అవుతాయని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా మార్కెట్ కమిటి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు ఉత్తమ్ చంద్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కుల సర్వే దేశానికి ఆదర్శం..!