శభాష్ శివకుమార్…!
– అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం
– అభినందించిన నేతలు, యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన శివకుమార్ ను స్థానిక నాయకులు, యువకులు శభాష్ అంటూ అభినందించారు. బహుజన సాహిత్య అకాడమి (బీఎస్ఏ) వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శివకుమార్ కు డా. బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఈసందర్భంగా శుక్రవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, అధ్యాపకులు పర్యాద రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మల్లేవం, వ్యాపార వెత్త నితిన్ సోమాని, తమ్మప్ప శ్రీనివాస్, సాయి ప్రసాద్, వెంకటేష్, నరేందర్, అరుణ్ కుమార్, శ్యామ్, కేతేశ్వర్, పవన్, నవీన్, సురేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

