తాండూరులో డ్రోన్ సర్వే షురూ..!
– సుమారు 6వేల ఎకరాల వివరాల నిక్షిప్తం
– భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసమే సర్వే
– పరిశలించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– సమీక్షించిన డీటీసీపీ, టౌన్ ప్లానింగ్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమృత్ 2.0లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాండూరు మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డ్రోన్ డిజిటల్ సర్వే ప్రారంభమయ్యింది. ఇప్పటికే డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత మూడు నాలుగు రోజులుగా భౌగోళిక సర్వే చేపట్టారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని మున్సిపల్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ ను గగనంలోకి పంపించి సర్వేను ప్రారంభించారు. ఈ ప్రక్రియను మున్సిపల్ చైర్ పర్సస్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీటీసీపీ అర్బన్ అధికారిణి హరిత, టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్ లు పరిశీలించారు.
వారి సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియా బృందం డ్రోన్ ను ఆకాశంలో ఎగురవేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ రాబోయే 20 ఏండ్లలో తాండూరు అభివృద్ధికి కావాల్సిన ప్రక్రియను మాస్టర్ ప్లాన్ ద్వారా చేపట్టబోతున్నామన్నారు. రోడ్లు, మురుగు కాలువలు. నీటీ కుంటలు తదితర వాటిని గుర్తించి ప్రజలకు అవసరమ్యే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు సర్వే దోహదపడుతుందన్నారు. డీటీసీపీ అధికారిణి హరిత మాట్లాడుతూ డ్రోన్ సర్వే ద్వారా తాండూరు మున్సిపల్ పరిధిలో సుమారు 6వేల ఎకరాలను పరిశీలించడం జరుగుతుందన్నారు.
రోడ్లు, భవనాలు, నీటి వనరులు. పార్కులు, మౌళిక వసతుల స్థితిని పరిశీలించి నివేధిక రూపొందించడం జరుగుతుందన్నారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ లాలప్ప, లైసెన్స్ డ్ ఇంజనీర్ అలీ, సందీప్ కుమార్. సర్వే ఆప్ ఇండియా బృందం ప్రతినిధి గోపాల్ రావు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

