పకడ్బందీగా డెటా ఎంట్రీ చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పకడ్బందీగా డెటా ఎంట్రీ చేయాలి
– జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్
– తాండూరు మున్సిపల్లో పక్రియ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేకు సంబంధించిన డెటా ఎంట్రీ పకడ్బందీగా చేపట్టాలని వి కారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం. సుధీర్ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. మన్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలతో కలిసి డెటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. సిబ్బంది, ఎన్యూమరేటర్లు సమన్వయంతో కుటుంబ సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. తప్పులు లేకుండా అందరి వివరాలను నమోదు చేయాలని సూచించారు. అంతకుముందు అడిషనల్ కలెక్టర్ సుధీర్ తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా సర్వే ఎంట్రీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఘనంగా లక్ష్మణ్‌ చారి జన్మదినం