పార్కుల అభివృద్ధే ధ్యేయం..!
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– 6, 11వ వార్డులలో పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని పార్కుల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం 6వ వార్డు, 11వ వార్డులలోని పార్కులలో అభివృద్ధి పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయా వార్డుల కౌన్సిలర్లు బోయరవి, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ సుందకరీణతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంలో పార్కులు ప్రాధాన్యం వహిస్తాయన్నారు.
అద్వాన్నంగా మారిన పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు పట్టణంలోని పార్కులను అభివృద్ధి పరచడమే ధ్యేయమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, విజయాదేవి, సోమశేఖర్, నాయకులు బోయ రాజు, బంటు మల్లప్ప, యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, ఆయా వార్డుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

