ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ కుట్రే..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ కుట్రే..!
– గత ప్రభుత్వ నాయకులే సూత్రధారులు
– విద్యార్థులతో చెలగాటం ఆడితే సీరియస్ యాక్షన్
– తెలంగాణ మహిళ కోఆపరేటివ్ కార్పోరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి
– తాండూరులో వసతి గృహాం సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వసతి గృహాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో బీఆర్ఎస్ పార్టీ కుట్రే అని, గత ప్రభుత్వ నాయకులే పథక రచన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళ కోఆపరేటివ్ కార్పోరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన బాలికల వసతి గృహాం(ఆశ్రమ పాఠశాల)లో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం వసతి గృహాన్ని చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, తెలంగాణ ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాతతో కలిసి సందర్శించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినిలతో కలిసి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్, నిర్వహకులతో కూడా మాట్లాడారు.

అనంతరం బండ్రు శోభారాణి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వసతి గృహాలు, గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ జరగడంతో రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పాలకులు దీని వెనుక దాగి ఉన్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నోటీసులు పంపించారని గుర్తుచేశారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు పిల్లలను బలిచేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహాలు, గురుకులాలలో పేద విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో పాటు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తుంటే ఓర్వలేక కుట్రలకు పూనుకుంటున్నారని ద్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను అనారోగ్యాలకు గురిచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాలతో, జీవితాలతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ పార్టీ సీరీయస్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వసతి గృహాలు. గురుకులాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించడం జరిగిందన్నారు.

నిర్లక్ష్యం ప్రదర్శించిన వార్డెన్, నిర్వహకులను సస్పెండ్ చేయాలని కోరడం జరిగిందని తెలిఆపరు. అదేవిధంగా గిరిజన వసతిగృహా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. ప్రత్యేక వైద్యులతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అమ్మాయిలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా.. వారు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్. ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, మహిళ నాయకురాలు గాజుల మాధవి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఆరోగ్యాన్ని పెంచె నారింజ..!