ఔరా.. బాల మేధస్సు ‘ఎత్తు’లు..!
– ఉత్కంఠ భరితంగా తాండూరు చెస్ చాపింయన్ షిప్
– అండర్-14, 16 విభాగాలలో విజేతలు
– విజేతలను అభినందించిన ఆర్బీఓఎల్ ఎండి సరళా రెడ్డి
– హింధూ ధార్మిక పరిషత్, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదరంగం పోటీలో పాల్గొన్న విద్యార్థులు తమ బాల మేధస్సుతో వేసిన ఎత్తులు ఔరా అనిపించాయి. తాండూరు హింధూ ధార్మిక పరిషత్, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ లు సంయుక్తంగా మొదటి సారి నిర్వహించిన చెస్ చాంపియన్ షిప్-2024 పోటీలు ఉత్కంఠభరితంగా కొ నసాగాయి. ఈనెల 15 నుంచి పట్టణంలోని అన్ని స్కూళ్లలలో అండర్- 14, అండర్ స16 విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించారు. దాదాపు 800ల మంది వి ద్యార్థులు పలు పాఠశాలల నుంచి పాల్గొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తుది పోటీలు జరిగాయి. మొత్తం 104 మంది విద్యార్థులు చివరి పోరులో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు జరిగాయి.
అండర్-14లో షేక్ ఇబ్రహీం (నాగార్జున స్కూల్) విజేతగా నిలువగా భవాని శంకర్ (నేతాజీ గురుదేవ్) రన్నర్ గా నిలిచాడు. అదేవిధంగా అండర్-16లో ముతస్సీమ్ (సేయింట్ మార్క్స్ హైస్కూల్) విజేతగా నిలవగా సాయి చరణ్ బాబు(విశ్వవేద స్కూల్) లు నిలిచారు. తుది పోటీలో పాల్గొన్న విద్యార్థులు గెలుపు కోసం చెస్ లో వేసిన ఎత్తులు, పై ఎత్తులు ఔరా.. అనేలా ఉత్కంఠతను తలపించింది. అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెస్ పోటీలతో విద్యార్థులతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగంకు బానిసలు కాకుండా ఇలాంటి పోటీలలో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. హిందూ ధార్మిక పరిషత్, తాండూరు ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ చేపట్టే ఇలాంటి కార్యక్రమాలకు తమవంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు.
అదేవిధంగా మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందెందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు హింధూ ధార్మిక పరిషత్, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ చొరవను అభినందించారు. ఈ కార్యక్రమంలో హింధూ ధార్మిక పరిషత్ కన్వినర్ గాజుల బస్వరాజ్, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఆయా సంఘాల సభ్యులు. స్కూళ్ల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

