శబరీషా… శరణు.. శరణు..!
– అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ
– అయ్యప్ప దేవాలయంలో మార్మోగిన మణికంఠ నామస్మరణ
– స్వామికి పూజలు చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పాల్గొన్న బుయ్యని సోదరులు, కుటుంభీకులు
– తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, రాజకీయ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శరణం అయ్యప్పా.. స్వామీ అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి భజన కీర్తనలతో తాండూరులోని అయ్యప్ప స్వామి దేవాలయం శరణు గోషతో మార్మోగింది. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ పడిపూజకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి మాల ధరించిన అయ్యప్ప స్వాములుతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు తరలివచ్చారు.
అయ్యప్ప స్వామికి వేద మంత్రోచ్చరణల మద్య ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సతీమణీ బుయ్యని అరుణా రెడ్డి, సోదరులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సతీమణి బుయ్యని సరళారెడ్డి, బుయ్యని సత్యనారాయణ రెడ్డి, సతీమణి బుయ్యని రాధ, తల్లి బుయ్యని సత్యమ్మ, కుమారులు బుయ్యని శివకుమార్ రెడ్డి, బుయ్యని అవినాష్ రెడ్డి, కుటుంభ సభ్యులు అభిషేకాలు, పూజలు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి మెట్ల పూజ నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు భక్తి పారవశ్యాన్ని నింపాయి. స్వామి వారి పల్లకి సేవలో ఎమ్మెల్యే మనోహరెడ్డి పాల్పంచుకున్నారు.
స్వాముల కీర్తనలతో ఎమ్మెల్యే చిందులు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు అయ్యప్ప స్వాములకు సద్ది నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు తాండూరు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, సకల శుభాలు కలగాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు ఉత్తమ్ చంద్, పీఏసీఎస్ చైర్మ్ సురేందర్ రెడ్డి, మురళీగౌడ్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, వివిధ మండలాల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

