ప్రపంచంలోనే వైవిద్యం.. పోటోగ్రఫీ..!
– తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం
– లూయిస్ డాగ్యూరేకు ఫోటగ్రాఫర్ల నివాళులు
– అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఫోటోగ్రపీ ప్రపంచంలోనే వైవిధ్యమైన కళగా చిరకాలం నిలిచిపోతోందని పలువురు ఫోటోగ్రాఫర్లు సంతోషం వ్యక్తం చేశారు.

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవంను ఫోటో గ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం తాండూరు నియోజకవర్గ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం పట్టణంలోని వినాయక చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1837 లో డాగ్యురోటైప్ ప్రక్రియను కనుగొన్న జ్ఞాపకార్థంగా ఈ రోజును జరుపుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే ఫోటోగ్రఫీ వైవిధ్యమైన కళగా నిలుస్తోందని అన్నారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఉపాధ్యక్షులు షాబుద్దీన్, సహాయ కార్యదర్శి దివ్య రాము, సీనియర్ ఫోటోగ్రాఫర్లు శరణు, వీరన్న, పలువులు ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి…

