ర‌వాణా, వైద్య‌ శాఖ‌లో ఉద్యోగాలు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ర‌వాణా, వైద్య‌ శాఖ‌లో ఉద్యోగాలు
– త్వ‌ర‌లో నోటిఫికేష‌న్
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: రవా‌ణా‌శా‌ఖతో పాటు వైద్యా‌రో‌గ్యశా‌ఖలో 2,662 పోస్టుల భర్తీకి ఆర్థి‌క‌శాఖ ఆమోదం తెలి‌పింది. ఇందులో 61 క్యాట‌గి‌రీ‌లకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టు‌లకు సంబం‌ధించి వైద్యా‌రో‌గ్యశాఖ అధి‌కా‌రులు పంపిన ప్రతి‌పా‌ద‌నలు సక్రమంగా లేక‌పో‌వ‌డంతో టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ వాటిని తిప్పి పంపిం‌చింది. ఆయా పోస్టుల భర్తీకి ఉద్దే‌శించిన జీవోలు, అర్హతలు తది‌తర వివ‌రాలు సమ‌ర్పిం‌చా‌లని టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ సూచించింది. ఇప్పటికే గ్రూప్‌-1 నోటి‌ఫి‌కే‌షన్‌ జారీ చేసిన టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ (TSPSC) మరి‌కొన్ని నోటి‌ఫి‌కే‌షన్లు విడు‌దల చేసేందుకు సన్నా‌హాలు చేస్తు‌న్నది. త్వర‌లోనే ర‌వాణా శాఖ‌లో 149 అసి‌స్టెంట్‌ మోటర్‌ వెహి‌కిల్‌ ఇన్‌‌స్పె‌క్టర్‌ (AMVI) పోస్టుల భర్తీకి నోటి‌ఫి‌కే‌షన్‌ ఇవ్వను‌న్నట్టు సమా‌చారం. ఈ పోస్టుల భర్తీకి సంబం‌ధిం‌చిన ఇండెంట్‌ టీఎ‌స్‌‌పీ‌ఎ‌స్సీకి చేరింది. బీటెక్‌ ఆటో‌మొ‌బైల్‌, మెకా‌ని‌కల్‌ ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సులు పూర్తిచేసి‌న‌వారు ఏఎంవీఐ పోస్టులకు అర్హులు.