కేవీసీఎస్‌లో అట్టహాసంగా కమ్యూనిటీ హెల్పర్ డే
– ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు
– సమాజ సేవకుల వేషాధారణలో ఆకట్టుకున్న ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయ ఆవరణలో ఉన్న కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్) లో కమ్యూనిటీ హెల్పర్ డే వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. మంగళవారం స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజం కోసం పనిచేస్తున్న సేవకుల సేవలను విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. విద్యా, వైద్యం, సాంకేతికం వంటి రంగాలలో పాటు సామాజిక సేవా రంగాలలో చైతన్యం పంచే భారత స్వాతంత్ర వీరులు, ఆర్మీ సైనికులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సలు, జోకర్లు, వృత్తి రంగాలు వారు, కార్మికుల సేవల ప్రాధాన్యతను వివరిస్తూ ఆకట్టుకున్నారు.

విద్యార్థుల ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ హెల్పర్ డే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు అన్ని రంగాలలో నైపుణ్యం పొందేలా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. చదువుతో పాటు వి ద్యార్థులు మేధోశక్తిని పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

