గొట్టిగ వెంకటమ్మ యాదిలో…!
– తల్లి సమాధికి నివాళులు అర్పించిన నర్సింహారెడ్డి(బాబు)
– కోటబాస్పల్లిలో వర్ధంతి, పాల్గొన్న నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన తల్లి స్వర్గీయ గొట్టిగ వెంకటమ్మ, తండ్రి స్వర్గీయ మాజీ ఎంపీపీ గొట్టుగ మహిపాల్ రెడ్డిలను యాది చేసుకుని వారి స్మృతులను గుర్తుచేసుకున్నారు. మంగళవారం కోటబాస్పల్లిలో స్వర్గీయ గొట్టుగ వెంకటమ్మ 8వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి సోదరుడు, తాండూరు సిటీకేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి ట్రస్ట్ సభ్యులు నర్సింహారెడ్డి(బాబు) కుటుంబ సభ్యులతో కలిసి సృతి వనంలో ఉన్న తల్లి వెంకటమ్మ, తండ్రి మహిపాల్రెడ్డి సమాధులపై పూలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్వర్గీయ మహిపాల్ రెడ్డి సోదరుడు గొట్టిగ రాంరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, శశిధర్, పోలీసు వెంకటయ్య గౌడ్, రియాజ్, జగదీష్, కరణం చందు, కురవ రాజు, బురానోద్దీన్, బాల రాజు, మాశప్ప, బాలకృష్ణ, నభిసాబ్, చాకలి నర్సింలు, మిట్టబాస్పల్లి నరేందర్ రెడ్డి, నరహరి, మాల సురేష్, చాకలి ప్రకాష్, ఎండీ మౌలానా, చాకలి విజయ్, భరత్, బోయిని విఘ్నేష్, ఎండా దావుద్ గౌసోద్దీన్, అశోక్, కొత్తింటి సమ్మప్ప, కొండన్ రవి, చాకలి శేఖర్, బాల అంజిలప్ప, బాయికాడి చంద్రప్ప, కొత్తింటి పాండు, బోయిని జగదీష్, తలారి వెంకటె ఏష్, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ మాల రాప్ప, దావుద్, సీటీకేబుల్ మేనేజర్ నారాయణ గౌడ్, గ్రామ పెద్దలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

