వార్డుల అభివృద్ధికి కృషి..!
– 9వ వార్డులో సీసీ రోడ్డు పనులు
– ప్రారంభించిన మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం 9వ వార్డులో సీసీ రోడ్డు పనులను చైర్మన్ బాల్ రెడ్డి స్థానిక నేతలు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు మల్లప్ప ముదిరాజ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని అన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణంలోని వార్డుల అభివృద్ధి జరుగుతుందన్నారు. పాలక వర్గం పదవీ కాలం ముగిసినా కూడా ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంలో దృష్టి సారించడం జరుగుతుందన్నారు. కాలనీలో రొ డ్డు నిర్మించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

