వేం నరేందర్‌ రెడ్డితో బీఎస్ఆర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వేం నరేందర్‌ రెడ్డితో బీఎస్ఆర్..!
– మర్యాదపూర్వక భేటీలో శీనన్న
– ‘స్థానిక’ రాజకీయాలపై చర్చ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు(ప్రజా వ్యవహరాలు) వేం నరేందర్ రెడ్డితో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి)(బీఎస్ఆర్) భేటి అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో వేం నరేందర్ రెడ్డిని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులోని రాజకీయాలు, అభివృద్ధి విషయాలపై చర్చించుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చించారు. కాంగ్రెస్ ఆరు గ్యాంరెంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలను చైతన్య పరచాలని వేం నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసేందుకు దృష్టిసారించడం జరుగుతుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

అల్లంతో అద్బుత లాభాలు..!