ఆకలి తీర్చే భద్రేశ్వరుడూ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆకలి తీర్చే భద్రేశ్వరుడూ..!
– ముస్తాబవుతున్న అన్నదాన సత్రం
– ఎమ్మెల్యే, దాతల సహాకారంతో వేగంగా నిర్మాణ పనులు
– అందుబాటులోకి తెచ్చి నిత్యఅన్నదానంకు కృషి
– దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వరుడూ భక్తుల ఆకలి తీర్చే స్వామిగా నిలుస్తున్నారు. ప్రతి రోజూ దేవాలయంలో వందలాది భక్తులకు అన్నదానం జరుగుతోంది. ఈ సేవలను మరింత విస్తరించేందుకు దేవాలయ కమిటి కృషి చేస్తోంది. ఇందుకోసం దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాకారంతో దేవాలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతోంది. 45 రోజుల క్రితం అన్నదాన సత్రం నిర్మాణానికి అంకురార్పణ చేయగా పనులు వేగిరంగా కొనసాగుతున్నాయి. సత్రం నిర్మాణంకు సుమారు రూ. 1కోటికి పైగా నిధులు అవసరమని అంచనా వేశారు.

ఇప్పటికే దాతల సహాకారంతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. సత్రం పనులు పూర్తి చేసి నిత్యం అన్నదానం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ తెలిపారు. పూర్వం దేవాలయాలో దాసోహ సేవతో అన్నదాన కార్యక్రమాలు జరిగేవని గుర్తుచేశారు. గత ఆరు నెలల నుంచి వీరశైవ యువదళ్ సభ్యులు భక్తులకు అన్నదానం చేయాలని మళ్లీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దేవాలయంలో అన్నదానం జరుగుతుందని, త్వరలోనే అన్నదాన సత్రంను అందుబాటులోకి తీసుకవచ్చి వేలాది మంది భక్తులకు నిత్య అన్నదానం చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. దాతల సహాకారంతో అన్ని ఏర్పాట్లు చేసి నిర్విఘ్నంగా కొనసాగిస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ సంక్షేమం… నిరంతరం..!