రైతులకు మరింత మెరుగైన సేవలకు అవకాశం
– అందుకే పదవికాలం పొడగించిన ప్రభుత్వం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన డీసీసీబీ చైర్మన్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సహాకార సంఘాల పదవికాలం పొడగింపుతో రైతులకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవప్తంగా ఉన్న సహాకార సంఘాల పదవి కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కలిసి విశేష కృషి చేశారు.
ఈ సందర్భంగా శనివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని టీఎస్ క్యాబ్ చైర్మన్ రవీందర్ రావు, వైస్ చైర్మన్ సత్తయ్య, జిల్లాల డీసీసీబీ చైర్మన్లు కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సహాకార సంఘాలలో రైతులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంఘాల పదవి కాలాన్ని పొడగించిందని అన్నారు. ఈ మేరకు చైర్మన్లు రైతులకు సంఘాల సేవలు అందేలా చూడాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

