కుక్క సంపాదన రూ. 23 లక్షలు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కుక్క సంపాదన రూ. 23 లక్షలు..!
– 3 రోజుల్లో సాధించిన హస్కీ జాతి కుక్క
– ఎలాగో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు
దర్శిని డెస్క్ : ఏంటి కుక్క లక్షలు సంపాదించిందా.. అని ఆశ్చర్చానికి గురయ్యారా…! అవును ఇది నిజం. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా ఒక కుక్క ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని ప్రముఖ పర్యాటక నగరమైన లిజియాంగ్‌లోని హోమ్‌స్టే యజమాని జు ఈ కుక్కను పెంచుకున్నాడు. హకిమి పేరుతో ఉన్న ఈ హస్కీ జాతి పోర్టర్‌గా పనిచేస్తుంది. ఈ కుక్క కేవలం మూడు రోజుల్లోనే 200,000 యువాన్లు (US$27,000) (రూ. 27 లక్షలు) వరకు సంపాదించింది. హకీమి దాదాపు 200 మీటర్ల దూరం ట్రాలీని లాగి కేవలం మూడు రోజుల్లోనే రూ.23 లక్షలు సంపాదించినట్టుగా.. హకిమి యజమాని వివరించాడు.

నిజానికి, ఇది జూ హోమ్‌స్టే, అక్కడ బస చేసే అతిథుల కోరిక, ఇష్టం మేరకు హకీమి వారి సామాను మోస్తుంది.. హకీమి సాధారణంగా రోజుకు మూడు నుండి ఆరు సార్లు ట్రాలీ ద్వారా వస్తువులను తీసుకువెళ్తుంది. హకీమి అందించే ప్రత్యేకమైన సేవ కారణంగా దాదాపు 80 శాతం మంది హోమ్‌స్టే అతిథులు అక్కడే ఉండటానికి ఇష్టపడతారు. హకీమి సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయింది. ఈ పెంపుడు కుక్క వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు అన్ని వీడియోలు 1 మిలియన్ నుండి 10 మిలియన్ల వ్యూస్‌ కంటే ఎక్కువగానే సంపాదించాయి.

హకిమి తమ ఇంటికి వచ్చినప్పుడు చాలా చురుగ్గా ఉండేదని చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్‌లో ఓ రోజున హకిమిని వాకింగ్‌ కోసం బయటకు తీసుకెళ్లినప్పుడు అది ఒక ట్రాలీని లాగేందుకు ప్రయత్నించంది. అలా కొద్దీరోజుల్లోనే అత్యంత వేగంగా ట్రాలీని లాగడం నేర్చుకోవడం చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పాడు. దానికి ఎప్పుడూ, ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని చెప్పాడు.. మొదట్లో తరచూ కిందపడిపోవడం, ఎదురుగా వచ్చే వారిని ఢీకొట్టడం చేసేదని చెప్పాడు. కానీ, క్రమంగా అది చాలా మెరుగుపడింది. ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుందని చెప్పాడు. ఇప్పుడు సామాగ్రిని పాడు చేయకుండా చాలా జాగ్రత్తగా లాక్కొస్తుందని చెప్పాడు.

ఇదికూడా చదవండి…

వివరాల నమోదుకు ఫోన్ చేస్తే చాలు..!