దీపావ‌ళి పండ‌గ‌ను సంతోషంగా జ‌రుపుకోవాలి

తాండూరు

దీపావ‌ళి పండ‌గ‌ను సంతోషంగా జ‌రుపుకోవాలి
– టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ బొబ్బిలి శోభారాణి
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: దీపావళి పండ‌గ‌ను అంద‌రు సంతోషంగా జ‌రుపుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ బొబ్బిలి శోభారాణి అన్నారు. బుధ‌వారం ఆమె త‌న నివాసంలో ప‌లువురు మున్సిప‌ల్ జ‌వాన్ల‌తో పాటు కార్మికుల‌కు కొత్త దుస్తుల‌ను అంద‌జేశారు. త‌న సొంత ఖ‌ర్చుల‌తో కార్మికుల‌కు ఈ దుస్తుల‌ను అంద‌జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ ప్ర‌జ‌లంద‌రికి దీపావ‌ళి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా మున్సిప‌ల్ కార్మికుల‌కు నూత‌న దుస్తుల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని, దీపావ‌ళి పండ‌గ‌ను కార్మికులు కుటుంబ సమేతంగా సంతోషంగా జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు.