ఘనంగా రంజాన్ పండగ

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా రంజాన్ పండగ
– సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
– శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఈద్-ఉల్-పితర్గా పిలుచుకునే రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ సమీపంలోని చెనెస్పూర్ రోడ్డు మార్గంతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఖాంజాపూర్ గేటు సమీపంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు వేల సంఖ్యల్లో పాల్గొని అందరికి మంచి జరగాలని సామూహిక ప్రార్థనలు చేశారు.

ఈ వేడుకలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో పాటు పలు పార్టీల నేతలు, ప్రభుత్వ అధికారులు హాజరై ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెనెష్ పూర్ రోడ్డు మార్గంలోని ఈద్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధికి తన వంతు సహాకారం అందిస్తానని పేర్కొన్నారు. మరోవైపు రంజాన్ ఉత్సవాల్లో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీఐలు నగేష్, సంతోష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, నాయకులు కరణం పురుషోత్తం రావు. డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, జీ.రవిందర్, బుయ్యని అవినాష్ రెడ్డి, మసూద్, మాజీ కౌన్సిల్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బంటు వేణు, ఏఎంసీ డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, వడ్డె శ్రీనివాస్, బిర్కడ్ రఘు, ఈద్గా కమిటి అధ్యక్షులు యూసుఫ్ ఖాన్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం