పేకాట రాయుళ్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
– 8సెల్ ఫోన్లు, రూ. 54వేల నగదు స్వాధీనం
కోట్‌పల్లి, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోట్‌పల్లిలో పండగ రోజు పేకాట ఆడుకున్న పేకాట రాయుళ్లపై జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. నిషేధిత పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్నారు. వారి నుంచి పేకాట ముక్కలతో పాటు ఎనిమిది సెల్ ఫోన్లు, రూ. 54 వేల 500లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోట్‌పల్లి పోలీసులు తెలిపారు.