మార్వాడి సమాజంలో జోష్..!
– రాజస్థాని ప్రగతి సమాజంకు కార్యవర్గం ఎన్నిక
– రాజస్థాని మహిళా మండలి అధ్యక్ష, కార్యదర్శుల నియామకం
– అట్టహాసంగా రెండు సంఘాల ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని మార్వాడి సమాజంలో జోష్ నిండింది. ఒకేసారి సమాజంలోని రెండు సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గాలను ఎన్నుకున్నారు. తాండూరు మార్వాడీ సమాజంలో రాజస్థాని ప్రగతి సమాజం, రాజస్థాయి మహిళ మండలిలు పెద్ద సంఘాలుగా కొనసాగుతున్నాయి.

సోమవారం రాత్రి తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్‌లో నూతనంగా ఎన్నికైన సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. రాజస్థాని ప్రగతి సమాజం నాయకులు రమేష్ చంద్ర సార్డా ముఖ్య అతిథిగా హాజరు కాగా ప్రమాణ స్వీకార అధికారి రాజ్ గోపాల్ సార్డా సమక్షంలో సమాజం అధ్యక్షులుగా మురళీధర్ గగ్రాని, కార్యదర్శిగా సంపత్ కుమార్ సార్డా, కోశాధికారిగా సంజయ్ సోని, ఉపాధ్యక్షులుగా ఓం ప్రకాష్ పర్తాని, సహాయ కార్యదర్శిగా ఆనంద్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా ద్వారాకా ప్రసాద్ సార్డా, లక్ష్మీకాంత్ సోమాని, భగవాన్ దాస్ బూబ్, సన్నిఅగ్రవాల్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

అదేవిధంగా రాజస్థాని మహిళ మండలి నూతన అధ్యక్షురాలుగా కిరణ్ సార్డా, కార్యదర్శులుగా వర్షా కైలాస్ సార్డా, కోశాధికారిగా కల్పన ఆనంద్ రాఠి, ఉపాధ్యక్షులుగా హేమా గోవింద్ సోని, వైజయంతి మాల భగవాన్ దాస్ బూబ్, సహాయ కార్యదర్శులుగా రాధిక మధుసూదన్ సార్డా, రీతూ సంజయ్ సోనిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒకేసారి రెండు సంఘాలలో నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరగడంతో మార్వాడి సమాజంలో జోష్ నిండింది. ఈ కార్యక్రమంలో సమాజం పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

