ముఖాన్ని కా*ల్చి నీటి గుంతలో వేశారు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ముఖాన్ని కా*ల్చి నీటి గుంతలో వేశారు
– గుర్తుతెలియని మహిళ దా..రుణ హ..త్య
– చేతిపై ఓ పేరుతో పచ్చబొట్టు

– పెద్దేముల్ మండలంలో కలకలం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఓ మహిళ ముఖాన్ని కాల్చీ నీటి గుంతలో పడేసి వెళ్లిపోయారు గుర్తుతెలియని దుండగులు. గుర్తుతెలియని మహిళను దా..రుణంగా హత్య చేసిన సంఘటన పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. ఈ హ..త్యోందతం బుధవారం వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ గ్రామ శివారులోని ఓ నీటి గుంతలో సుమారు 35 ఏండ్లు ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలంలో మహిళ ముఖంను కాల్చిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ కుడి చేతిపై యశోధ అనే పేరు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు మృతురాలి ఆచూకి తెలిస్తే సెల్: 87125670053, 87125670051లకు సమాచారం అందించాలని పెద్దేముల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సూచించారు.

ఇదికూడా చదవండి…

భద్రేశ్వర్‌కీ.. జై..!