డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహా ఏర్పాటుకు తోడ్పాటు
– తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– జయంతిలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహా ఏర్పాటుకు తోడ్పాటు అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని జగ్జీవన్ రామ్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో నాయకులతో కలిసి విఠల్ నాయక్ బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

జయంతి ఉత్సవాల్లో విఠల్ నాయక్ సహాకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ స్ఫూర్తితో దేశ విముక్తి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. 10సార్లు ఎంపీగా గెలిచి.. భారత దేశ ఉప ప్రధాన మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలు గుర్తుండిపోయాయని అన్నారు. రైతులకు, దళితులతో పాటు అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. తాండూరులో డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహా ఏర్పాటుకు తనవంతు తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డా. సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కె.మల్లికార్జున మాదిగ, మాజీ అధ్యక్షులు మెట్లి ఆశన్న మాదిగ, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, ఎమ్మెస్పీ జిల్లా నాయకులు స్వామిదాస్ మాదిగ, పగడాల ఆందన్ కుమార్, జినుగుర్తి నర్సింలు మాదిగ, బాలరాం మాదిగ, బీజేపీ నాయకులు భద్రేశ్వర్, వై. రాములు, నరేష్, రఘుపతి, రవికుమార్, జుంటుపల్లి వెంకట్, నరేష్, ఎం. వెంకట్, రాజ్ కుమార్, విద్యార్థి సంఘం నాయకులు శివాజీ మాదిగ, ఉమా శంకర్, శ్రీకాంత్, జయప్రకాస్, సుభాష్ మాదిగ, శ్రీనివాస్, గజలప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

