పేదల ఆరోగ్యానికి భరోసా

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి భరోసా
– లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ వరం
– ఎల్‌ఓసీ అందజేసిన ఉమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ పథకంతో భరోసా కల్పిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలోని పర్వత్‌పల్లి గ్రామానికి చెందిన బంటు నారాయణమూర్తికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 60 వేల చెక్కు మంజూరు అయ్యింది. దీంతో శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన నివాసంలో లబ్దిదారునికి సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కారు అముల చేస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌ పథకం పేదలకు ఎంతో లబ్దిచేకూరుస్తుందన్నారు. అనారోగ్యంతో బాధపడే పేదల వైద్య ఖర్చులకు భరోసా అందిస్తుందని అన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోయిని వెంకటయ్య, నాయకులు ఉన్నారు.