జై.. భద్రేశ్వర స్వామి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జై.. భద్రేశ్వర స్వామి..!
– వైభవంగా జాతర ఉత్సవాలు ప్రారంభం
– దేవాలయంలో ప్రత్యేక పూజలు
– దాసోహంలో మహాప్రసాద వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. భద్రేశ్వర స్వామి అంటూ తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిధ్వనించింది. మంగళవారం నుంచి దేవాలయంలో జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ ల సమక్షంలో జాతర ఉత్సవాలను ప్రారంభించారు.

దేవాలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా జాతర ఉత్సవాలను పురస్కరించుకుని నూతనంగా ప్రారంభించిన అన్నపూర్ణ మాత దాసోహ మందిరంలో మహా ప్రసాద వితరణ ప్రారంభించారు. తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. వివేక్ శెరికార్, కుటుంబ సభ్యుల సహాకారంతో భక్తులకు అన్నదానం ప్రారంభించారు. డా. వివేక్ శెరికార్ దంపతులు భద్రేశ్వర స్వామి సన్నిధిలో అన్నదానం చేశారు.

అనంతరం దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి యేడాది మాదిరిగానే జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచి భద్రేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మఠం నీలంకంఠ స్వామి, దేవాలయ కమిటి సభ్యులు కోటం సిద్ధలింగం, కిరణ్ కుమార్, గంగా శ్రావణ్, వీరశైవ సమాజం సభ్యులు జొన్నల వినోద్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..!