మున్సిపల్‌లో మనోహరన్న మ్యాజిక్..!
– ఎమ్మెల్యే సమక్షంలో సాఫీగా కౌన్సిల్ సమావేశం
– 22 అంశాల ఎజెండాకు సభ్యుల ఆమోదం
– అహాలను వదిలేసి అభివృద్ధి చేయాలని సూచన
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాటలకు అందరు ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అంటేనే చర్చనీయాంశంలకు దారితీస్తుంది. గత నాలుగు ఏండ్లలలో వర్గ పోరుతో అట్టుడికే పోయేది. కాని ఈసారి అలాంటి పరిణాలు కనిపించలేదు. తొలిసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అంతా మ్యాజిక్ చేయడంతో సమావేశం సాఫీగా ముగిసింది. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావవేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లందరిని మాయ చేశారు. తన మాటలతో సభ్యులందరు అభివృద్ధిపై దృష్టిసారించేలా బోధచేశారు.
గత నాలుగేళ్ల పదవి కాలంలో జరిగిన ఈగోలను పక్కన పెట్టి వచ్చే ఏడాది కాలమంతా అభివృద్ధిపైనే దృష్టిసారించాలన్నారు. ప్రజ సమస్యలను పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గతంలో రాజకీయ వర్గాల కారణంగా పట్టణాభివృద్ధి జరగలేదన్నారు. పార్టీలను ఎన్నికల వరకు మాత్రమే చూసుకోవాలని, గెలిచిన తరువాత పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుని తాండూరు పట్టణాన్ని ఆదర్శంగా నిలుపుకోవాలన్నారు. ఇకనుంచి అభివృద్ధిపై దృష్టిసారిస్తేనే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ పట్టం కడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మన జిల్లా, మన నియోజకవర్గమే కాబట్టి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పట్టణ అభివృద్ధికి సీఎం సహాకారంతో పాటు తన వంతుగా తోడ్పాటు అందిస్తానని అన్నారు.
పట్టణాభివధ్ధే ధ్యేయం : చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
మరోవైపు సమావేశం అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 అంశాలతో కౌన్సిల్ ఎజెండాను ప్రవేశ పెట్టగా 2 అంశాలను తిరస్కరించడంతో మిగతా 22 అంశాలను ఆమోదించుకుని సమావేశాన్ని ప్రశాంతంగా జరుపుకున్నట్లు వివరించారు. తైజార్, స్లాటర్ హౌస్ వేలంతో పాటు అభివృద్ధి పనులకు శిలా ఫలకాల ఏర్పాటు అంశాలను వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. ఇన్నాళ్లు వర్గపోరుతో సాగిన సమావేశాలు తొలసారి సాఫీగా జరిగిందని చెప్పుకొచ్చారు. పట్టణాభివృద్ధి ద్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఈ సంవత్సరం కాలం పార్టీలకతీతంగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొందరు కావాలనే ఎంజెడాను రద్దు చేయాలని ప్రయత్నించారని, వారి విమర్శనలను కొట్టిపారేశారు.
ఎమ్మెల్యే, అధికారులకు సన్మానం
అంతకుముందు కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ అధికారులకు సన్మానించారు. మున్సిపల్ ఎక్అఫీషియో సభ్యులుగా పదవి బాధ్యతలు, తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, అధికారులు సన్మానించారు. అదేవిధంగా తాండూరు. మున్సిపల్ ఉత్తమ మేనేజర్ గా నరేందర్ రెడ్డి, ఉత్తమ డీఈగా ఖాజాలు అవార్డులు దక్కించుకోవడం పట్ల వారిని కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, సోమశేఖర్, మధుబాల, అంతారం లలిత, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ వైస్ చైర్మన్లు సాజిద్ అలీ, ఆసిఫ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, విజయాదేవి, బోయరవి, వెంకన్న గౌడ్, మమత, బోంబీనా, బాలప్ప, సాహు శ్రీలత, సంగీత ఠాకూర్, సింధూజ గౌడ్, రాము, ప్రవీణ్ గౌడ్, మంకాల రాఘవేందర్, సల్మా పాతిమా, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, వెంకట్రామ్ నాయక్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

