అట్టహాసంగా విఠల్ నాయక్ వివాహా వార్షికోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా విఠల్ నాయక్ వివాహా వార్షికోత్సవం
– శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– హాజరైన పలువురు ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన గిరిజన నాయకుడు, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్, కిష్టమ్మ (ఎల్ఎఫ్ఎల్ హెచ్)ల 25వ వివాహా వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

సోమవారం రాత్రి పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో విఠల్ నాయక్, కిష్టమ్మ దంపతులు వివాహా వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. వధూవరుల్లాగా దండలు మార్చుకున్నారు. కేక్ కట్ చేసి తినిపించుకుని శుభకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడులకు తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డితో పాటు టీపీపీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తంరావు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ప్రజా సంఘాల నాయకులతో పాటు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరై విఠల్ నాయక్, కిష్టమ్మ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం విఠల్ నాయక్, కిష్టమ్మ దంపతులు గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కూతురు ప్రశాంతి, అల్లుడు సురష్ నాయక్, బందుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ