ఎన్నికల కోలాహలం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్నికల కోలాహలం..!
– తాండూరు మున్సిపల్లో సందడి
– నామినేషన్ల ప్రక్రియపై జోరుగా ఎంక్వైరీ
– పన్నుల వసూళ్లకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. బుధవారం ఉదయం నుంచి మున్సిపల్ ఆఫీసులో కోలాహలం నెలకొంది.

కౌన్సిలర్ల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కార్యాలయానికి నేతలు తరలివస్తున్నారు. పోటీ చేయాలనుకునే ఆశావాహులు నామినేషన్ల ప్రక్రియపై నిభందనలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద అడిగి తెలుసుకున్నారు. ఆశావాహులతో కౌంటర్ కిక్కిరిసి పోయింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే వారు నొ డివ్ సర్టిఫికెట్ అవసరం రూల్ ఉంది. దీంతో కార్యాలయంలో ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పన్నులు చెల్లించడం కోసం ఎగబడ్డారు.

స్వతంత్ర అభ్యర్థులకు కొత్తరూల్
మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు కొత్త నిబంధన వచ్చినట్లు అధికారులు తెలిపినట్లు అభ్యర్థులు తెలిపారు. ఇదివరకు స్వతంత్ర అభ్యర్థులకు పోటీ చేయాలంటే 10 మంది మద్దతు అవసరం ఉండేదని.. కానీ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థికి ఒకరి ప్రపోజల్, ఇద్దరు సాక్షులు మాత్రమే అవసరమని అధికారులు చెప్పినట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి…

 

హస్తం.. ‘పుర’విప్పుతోంది…!