హస్తంలో.. ‘ఒరిజినల్’ రచ్చ..!
– సీనియర్ల గుర్తింపుపై రమేష్ మహారాజ్ ఫైర్
– జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ముందు ఆవేదన
– పార్టీలో నేతల స్పందన ఎలా ఉందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ రచ్చ రేగింది. మంగళవారం తాండూరులో జరిగిన పార్టీ నియోజకవర్గ సంస్థాగత సన్నాహాక సమావేశంలో ఆ పార్టీ సీనీయర్ నాయకులు, మాజీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం. రమేష్ మహరాజ్ ఒరిజనల్ నేతలు అని సంభోదిస్తూ చేసిన వాఖ్యలు తీవ్ర చర్చనీయాశంగా మారాయి. పట్టణంలోని తులసీ గార్డెన్ లో జరిగి సంస్థాగత సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇంచార్జ్‌లు వినోద్ కుమార్, నరేందర్, రాంశెట్టి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సమావేశం వేదికపై అతిథులతో పాటు పాత, కొత్త ప్రజా ప్రతినిధులు, నేతలు ఆశీనులయ్యారు. కొద్ది సేపటికే ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహారాజ్ వచ్చారు. అప్పటికే స్టేజీపై కుర్చీలు నిండిపోవడంతో సామాన్య కార్యకర్తల మద్య కూర్చోనేందుకు వెళ్లారు. వెంటనే జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పార్టీ నేతలు రమేష్ మహారాజ్‌ను బుజ్జగించి స్టేజీ పైకి తీసుకవచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఇంచార్జ్ వినోద్ కుమార్‌ల సమక్షంలో పార్టీలో సీనీయర్ నేతలు, కొత్తగా చేరిన నేతలకు గుర్తింపు ఏవిధంగా ఉందో చెప్పుకుంటూ వచ్చారు. పార్టీలో ఒరిజినల్ నేతలకు గుర్తింపు లేదని, ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకే ప్రాధాన్యం దక్కుతుందని ఫైర్ అయ్యారు. పార్టీలో కరుడుగట్టిన ఒరిజినల్ నేతలకు గుర్తింపు, పదవులు దక్కే విధంగా చూడాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత సమావేశంలో రమేష్ మహారాజ్ చేసిన వాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సమావేశంలో వేదికపై రమేష్ మహరాజ్ మాట్లాడుతుంగా కార్యకర్తలు విజిల్స్ వేసి మద్దతు పలికారు. సమావేశం తరువాత పార్టీ నేతలు, కార్యకర్తలు రమేష్ మహరాజ్ వాఖ్యలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదికూడా చదవండి…

