మరింత బలమైన శక్తిగా బీజేపీ
– తాండూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం
– హాజరైన మాజీ ఎంపీ కొండా, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదగాలని ఆ పార్టీ నేతలు అభిలాషించారు. మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో బీజేపీ హావా నడుస్తుందన్నారు.
బీజేపీ ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని చేపడుతున్నారు. పార్టీని మరింత బలమైన శక్తిగా ఎదిగేలా అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మాజీ ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, నాయకులు ఎం.నరేష్ మహారాజ్, అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడ చదవండి…

