ఎంతపని చేస్తివి డ్రైవరన్నా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంతపని చేస్తివి డ్రైవరన్నా..!
– అజాగ్రత్త వల్ల మహిళకు గాయాలు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సుకింద పడి ఓ మహిళ గాయాలపాలయ్యింది. ఈసంఘటన కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన బాయిముళ్ల బాలమణి(54) తన తల్లిని తాండూరుకు వెళ్లే బస్సును ఎక్కించేందుకు స్థానిక బస్టాండుకు వచ్చింది. అక్కడి వచ్చిన టీజీ34 0058 అనే బస్సులో ఎక్కించి దిగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా ముందుకు కదలించాడు. దీంతో బాలమణి ఎడమ కాలు మీద నుంచి బస్సు వెళ్లింది. ఈక్రమంలో బాలమణి కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

మహిళలకు ఫ్రీ గ్యాస్‌ సిలిండర్..!