వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి..!
– తాండూరులోనే.. కోడంగల్ మెడికల్ కాలేజీ
– మూడు నెలల్లో తరగతుల ప్రారంభానికి చర్యలు
– అనుబంధ ఆసుపత్రిల్లో మౌళిక సదుయాల కల్పనకు కృషి
– రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా. అజయ్ కుమార్
– తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్, నర్సింగ్ కాలేజీల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య, వృత్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తోందని, ఇందులో భాగంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా. అజయ్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీని, మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలను ఆయన తనిఖీ చేశారు.

కోడంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీని తాండూరు పట్టణంలో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీలోనే ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్న సందర్భంగా ముందుగాయ కమీషనర్ డా. అజయ్ కుమార్ నర్సింగ్ కాలేజీని సందర్శించారు. పనులు ఏయే దశలో ఉన్నాయని, ఎప్పటి లోగా పూర్తి అవుతాయనే విషయాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండబోతున్న మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలను ఆయన తనిఖీ చేశారు. మెడికల్ కాలేజీలో, జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో కావాల్సిన మౌళిక సదుపాయాలు, ఏర్పాట్లను నివేధికలో నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కమీషనర్ డా. అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఎన్ఎంసీ(జాతీయ వైద్య కమిషన్) పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సింగ్ కాలేజీ, ఆసుపత్రులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీలో కోడంగల్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. భవనాన్ని మూడు నెలల్లో పూర్తి చేయించి 50 మందితో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కాలేజీలో, ఆసుపత్రులలో కావాల్సిన మౌళిక సదుపాయాలను గుర్తించేందుకు సందర్శించడం జరిగిందని వివరించారు. ఈ నివేధికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, వైద్యులు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

