తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం జిల్లా అధ్యక్షులుగా కోహీర్ శ్రీనివాస్ యాదవ్
– రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గె మల్లేశం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంకు చెందిన కోహీర్ శ్రీనివాస్ యాదవ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం సమక్షంలో కోహిర్ శ్రీనివాస్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశం కోహీర్ శ్రీనివాస్ యాదవ్‌కు నియామకపత్రం అందజేశారు. అనంతరం కోహీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కురుమ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గె మల్లేశంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ కురుమ సంఘం ఉపాధ్యక్షులు గౌడి వెంకటేశం, పూజారి పండు ,సాయిపూర్ జగదీష్, యాలాల మండల కురుమ సంఘం అధ్యక్షులు కుర్వ మహిపాల్, తాండూరు కుర్వ సంఘం అధ్యక్షులు వెంకటయ్య, ఉపాధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు.


