ఇసుక బుకింగ్.. ఇక మీసేవలో..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఇసుక బుకింగ్.. ఇక మీసేవలో..!
– కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌కు చాన్స్‌
– కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఇసుక అవసరమైన వారు అనుమతులు పొందాలంటే మీసేవకు వెళ్లాల్సి రావచ్చు. త్వరలో మీ సేవ నుంచే ఇసుక అనుమతులు పొందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. దీనిపై అధికార యంత్రాంగాలతో కలిసి కసరత్తు చేస్తోంది.

వికారాబాద్‌ జిల్లా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్టే వేసేందుకే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాల్లో ఇసుక రవాణా యధేచ్చగా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా అక్రమార్కులు అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఇసుక పర్మిట్లు పొంది రవాణా సాగిస్తున్నారు.

ప్రభుత్వ పనుల కోసం అనుమతులు తీసుకుని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మంజూరు చేస్తున్న ఇసుకలో అక్రమార్కులు దోపిడికి పాల్పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మంజూరు చేసిన ఇసుకను అక్రమంగా ఇతరులకు విక్రయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు పొందిన ట్రిప్పులకు అధికంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ వెంచర్లు, ప్రవేటు ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్నారు. వీటన్నింటికి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు మీ సేవను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ-సేవ కేంద్రాల ద్వారా స్లాట్​ బుక్​ చేసుకుని తెప్పించుకునే వెసులుబాటును ఇక నుంచి కల్పించనుంది. వినియోగదారులు మీసేవ కేంద్రానికి వెళ్లి తమ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకుననే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ప్రజలకు, అవసరమైన వారికి ఇసుక అందుబాటులో ఉండడమే కాకుండా ప్రభుత్వానికి ఆధాయం పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదికూడా చదవండి…

బీసీల రిజర్వేషన్ తరువాతే ఎన్నికలు నిర్వహించాలి