
రేపు తాండూరులో పవర్ కట్
– అంతరాయం ఉండే ప్రాంతాలు ఇవే
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ భాను ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. నియోజర్గంలోని పెద్దేముల్ మండలంలో 33కేవీ సబ్ స్టేషన్ పరిధిలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

మండలంలోని గాజీపూర్, తట్టెపల్లి, ఇందూరుతో పాటు బంటారం, కోకాడ 33కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని అన్నిగ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వార్షిక నిర్వహణలో భాగంగా విద్యుత్ అంతరాయానికి ఇబ్బంది కలిగించే చెట్లను తొలగించడంతో భాగంగా పవర్ కట్ చేస్తున్నట్లు వివరించారు. చెట్ల తొలగింపు అనంతరం విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

